కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్‌.. విషయం ఏంటంటే?

25 Dec, 2023 13:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చకపోతే కచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

కాగా, ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉంది. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్‌ గాంధీ ఎందుకు స్పందించలేదు. డీఎంకే నేతలు దేశాన్ని విచ్చినం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్‌ ఎందుకు అదుపు చేయడం లేదు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏంటో రాహుల్‌ గాంధీ చెప్పాలి. 

హిజాబ్‌ వివాదంపై కూడా రాహుల్‌ తన మౌనం వీడి.. తన వైఖరిని వెల్లడించాలి. కాంగ్రెస్‌ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం. తెలంగాణలో హామీల అమలుకు మరికొంత సమయం ఇస్తాం. తగిన సమయంలోగా హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోతే కచ్చితంగా పోరాటం చేస్తాం అని వార్నింగ్‌ ఇచ్చారు. 

>
మరిన్ని వార్తలు