‘చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు’

16 Jan, 2023 17:50 IST|Sakshi

తిరుపతి: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పని ఎప్పుడో అయిపోయిందని, చిత్తూరు జిల్లాను వదిలేసి చంద్రబాబు ఎప్పుడో వెళ్లిపోయారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈరోజు(సోమవారం) పెద్దిరెడ్డి తిరుపతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబును చిత్తూరు జిల్లా ప్రజలు ఏనాడు విశ్వసించలేదు. చంద్రబాబు ప్రజాకంఠక పరిపాలన చేశారు. చంద్రబాబు ఏడుపులను ప్రజలు విశ్వసించరు. చంద్రబాబుకు మమ్మల్ని తిట్టడం తప్ప వేరే పనేమీ లేదు.

చంద్రబాబు  ఇష్టమొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు. చంద్రబాబు తన ‍కోసం, తన ఎల్లో మీడియా కోసమే పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు. కుప్పంలో వైఎస్సర్‌సీపీనే గెలుస్తుంది. కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయం. ప్రజాస్వామ్మం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు ప్రజాకంఠక పాలనపై రాష్ట్రంలో అందరికీ తెలుసు. చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే చంద్రబాబు అజెండా. ప్రజా సంక్షేమ కోసమే సీఎం జగన్‌ పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా మా పక్షానే ఉన్నారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు