-

రాహుల్ గాంధీ అక్కడి నుంచే పోటీ చేస్తారు.. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రతీకారం తీర్చుకుంటారు..   

19 Aug, 2023 07:45 IST|Sakshi

లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్ళీ అమేధీ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేస్తారని కరాఖండిగా చెబుతున్నారు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. అమేధీ ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను ఓడించి తాము చేసిన తప్పును సరిచేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.   

యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రీజ్ లాల్ ఖబ్రీ స్థానంలో నియమితులైన అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక ప్రకటన చేసి సంచలనానికి తెర తీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేధీ నుంచే పోటీ చేస్తారని ప్రకటన చేశారు. మొదట కచ్చితంగా పోటీ చేస్తారని చెప్పిన ఆయన తర్వాత విలేఖరులు నొక్కి మరీ ప్రశ్నించడంతో కాస్త తటపటాయించి.. క్లాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అమేధీ ప్రజలు కూడా గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాటుని సరిచేసుకుని ఈసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

ఇదే పార్లమెంటు స్థానంలో గెలిచిన స్మృతి ఇరానీ కిలో పంచదార కేవలం రూ.15 కే అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పంచదార ఎటు పోయిందంటూ ప్రశ్నించారు. గత రెండు పర్యాయాల్లో వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై పొటీ చేసిన అజయ్ రాయ్ ఈసారి ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి పోటీ చేస్తానంటే తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  .       

గత సార్వత్రిక ఎన్నికల్లో అమేధీ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 2004 నుండి ఇదే పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన రాహుల్ గాంధీ గత పర్యాయం 2019లో మాత్రం ఓటమిని చవిచూశారు. అయినా కూడా ఆయన కేరళలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. 
 
ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలు

మరిన్ని వార్తలు