-

వీకే నరేష్‌కి డాక్టరేట్‌ ప్రదానం

27 Nov, 2023 03:29 IST|Sakshi
డాక్టరేట్‌ అందుకుంటున్న వీకే నరేష్‌

నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్‌ సీఏహెచ్‌ఆర్‌’ నుంచి ఆయన ‘సార్‌’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్‌ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్‌ స్పెషల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్  అండ్‌ హ్యూమన్  రైట్స్‌ (ఐఎస్‌ సీఏహెచ్‌ఆర్‌)’ కలిసి నిర్వహించాయి.

ఐఎస్‌ సీఏహెచ్‌ఆర్‌ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్‌ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్‌ పేరు ముందు లెఫ్టినెంట్‌ కల్నల్, సార్‌... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్‌ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. 

మరిన్ని వార్తలు