అదానీ కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌: మోదీ సర్కార్‌పై రాహుల్‌ ధ్వజం

31 Oct, 2023 14:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. విపక్ష ఎంపీలకు యాపిల్‌ నుంచి వార్నింగ్‌ మెసెజ్‌లు రావడంతో నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అల్గారిథమ్ లోపం యాపిల్‌ నుంచి ఈ సందేశాలు వస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇక కేంద్రం సమాధానంపై శివసేన (ఉద్ధవ్‌ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది సెటైర్లు వేశారు. ప్రతిపక్షాల ఫోన్లలో మాత్రమే యాపిల్‌ అల్గారిథమ్‌ పనిచేయకపోవడం హాస్యాస్పందంగా ఉందన్నారు.

కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఫైర్‌ అయ్యారు. విపక్ష ఎంపీలు, నేతలపై కేంద్రం నిఘా పెట్టిందని రాహుల్‌ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌లు అవుతున్నాయని తెలిపారు. ప్రశ్నించేవారి నోళ్లు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అదానీ కోసమే ఫోన్‌ ట్యాంపింగ్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఫోన్‌ ట్యాంపింగ్‌లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్‌ ఇస్తానని, తీసుకోవాలని సవాల్‌ విసిరారు.

కాగా పలువురు విపక్ష నేతల ఫోన్లకు యాపిల్‌ సంస్థల నుంచి వార్నింగ్‌ మెయిల్స్‌ వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, శివసేన(ఉద్దవ్‌ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా, తదితరులకు స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌ తమ ఐఫోన్‌, ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ చేస్తున్నట్లు  హెచ్చరికలు అందాయి. 
చదవండి: ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్‌ అలర్ట్‌.. మీ ఫోన్‌ హ్యాక్‌ అవుతుందంటూ వార్నింగ్‌

మరిన్ని వార్తలు