దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలు : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

25 Jan, 2021 09:04 IST|Sakshi

నరసరావుపేట: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహనరెడ్డిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ప్రధాన ప్రతిపక్షాలు దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మెమోరియల్‌ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని క్రీడల స్టేడియంలో నిర్వహిస్తున్న ఎడ్ల బలప్రదర్శన పోటీలకు ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వేలాది మంది రైతన్నలను ఉద్దేశించి సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. కరోనా కారణంగా ప్రాణహాని ఉందని ఉద్యోగులు అందరూ ఎన్నికలు వ్యతిరేకిస్తున్నారు తప్పితే తాము కాదన్నారు. తమకు ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం అన్నారు. ఎన్నికలను రద్దుచేయాలని కోరుకోవట్లేదని కేవలం వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. తాము ఎన్నికలకు భయపడుతున్నామంటూ కొన్ని పక్షాల నాయకులు చేస్తున్న ప్రచారం ఏమాత్రం వాస్తవంకాదన్నారు. భయమనే పదమే వైఎస్‌.జగన్‌కు తెలియదన్నారు.  

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ పౌరుషం, మాట నిలబెట్టుకోవటం, అభిమానం చూపించటంలో పలనాడు, రాయలసీమకు పోలిక ఉందన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన సిద్ధార్థరెడ్డిపై చూపిస్తున్న అభిమానం అలాంటిదన్నారు. కులాలు, మతాలను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారంటే ఆ పారీ్టకి ప్రజల్లో అభిమానం లేకపోవటమే కారణం అన్నారు. టీడీపీకి మనుగడలేదనే భావనతో దేవుళ్ల పేరుతో చిల్లర రాజకీయాలకు తెరతీశారన్నారు. సిద్ధార్థరెడ్డిని ఎమ్మెల్యే గోపిరెడ్డి శాలువా కప్పి సత్కరించారు. మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఎస్‌.ఏ.హనీఫ్, నాయకులు మిట్టపల్లి రమే‹Ù, కపలవాయి విజయకుమార్, వ్యవసాయ బోర్డు మెంబరు చల్లా నారపరెడ్డి, ఇప్పల దానారెడ్డి, మూరే రవీంద్రరెడ్డి, కనక పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు