బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌

8 Aug, 2021 21:18 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ ఆదివారం బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీలో చేరారు. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్‌ రాంజీ గౌతమ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీఎస్పీలో చేరిన ప్రవీణ్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల బతుకులు బాగు పడాలంటే విద్య, ఉపాధి కావాలని తెలిపారు. తాను రాజీనామా చేసిన రోజే కేసుపెట్టారని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసిన జన సునామీని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. బహుజన సమాజంలో బానిసలం కామని, పాలకులమని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే కేసీఆర్‌ తన ఆస్తులు అమ్మి దళితబంధు అమలు చేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలంగాణలో ఎన్ని ఆస్పత్రులు కట్టారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదు? అని నిలదీశారు. ఇప్పటివరకు సంపద మొత్తం 5 శాతం వర్గాల వద్దే ఉందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు