-

Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

10 Oct, 2022 18:11 IST|Sakshi

1. వాటిపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మోదీ, అమిత్‌షాకు మంత్రి జగదీష్‌రెడ్డి చాలెంజ్‌
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. చిక్కుల్లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే..
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బహిరంగంగా మద్యం తాగుతూ కెమెరాలకు చిక్కారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మల్లారెడ్డి ప్రచారం తర్వాత తన అనుచరులతో కలిసి మందు తాగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ట్విట్టర్‌లో కాదు పవన్‌.. దమ్ముంటే విజయవాడకు రావాలి: జోగి రమేష్‌ సవాల్‌
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా. పవన్‌ నువ్వు ఉండేది హైదరాబాద్‌లో.. షూటింగ్స్‌ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్‌ రియాలిటీస్‌ నీకేం తెలుసు?
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


    
5. ములాయం సొంత కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలుసా?
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆస్కార్‌ లెవల్‌ యాక్టింగ్‌.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!
అన్నం కోసం వెళ్తే.. అమృతం దొరికినట్లు.. మూవీ చూద్దామని వెళ్తే.. మెగాస్టార్‌ ఎదురొచ్చినట్లు..కొన్నిటిని వర్ణించడానికి మాటలు సరిపోవు.. అలాంటి సన్నివేశమే ఇది.. ఉరిశిక్ష పడి.. నేడో రేపో ప్రాణం తీసేస్తారు అన్నోడికి సడన్‌గా క్షమాభిక్ష పెట్టేస్తే వాడి ఫీలింగ్‌ ఎలా ఉంటుంది?
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్‌: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం
ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్‌విగ్‌లకు  సోమవారం నోబెల్ బహుమతిని ప్ర‌క‌టింశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భాగంగా పసికూన థాయ్‌లాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 10) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్‌ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఆదిపురుష్‌ వివాదం.. ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
గత కొద్ది రోజులుగా ఆదిపురుష్‌ టీజర్‌పై ట్రోల్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా మొత్తం ఆదిపురుష్‌ ట్రోల్స్‌, మీమ్స్‌తో నిండిపోయాయి. యానిమేటెడ్‌ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై పలు హిందు సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. తుపాకీతో బెదిరించి మహిళపై అత్యాచారం.. సర్వీస్‌ నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు
మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. మహిళను కిడ్నాప్‌, లైంగిక దాడి నేరారోపణల నేపథ్యంలో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు