ఉక్రెయిన్‌లో విద్యార్థులను పట్టించుకోవడం లేదు

4 Mar, 2022 06:13 IST|Sakshi

 ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శలు

వారణాసి: యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకుని ఉండగా ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌లో మన విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేసిందని దుయ్యబట్టారు. గురువారం వారణాసిలో సమాజ్‌వాదీ(ఎస్‌పీ) పార్టీ తరఫున జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగించారు.

‘పుతిన్‌తో సత్సంబంధాలున్న మీకు, యుద్ధం వస్తుందని మూడు నెలలు ముందుగానే తెలిసినా, భారతీయులను ఉక్రెయిన్‌ నుంచి ఎందుకు వెనక్కి తీసుకు రాలేకపోయారు?’ అని ప్రధానిని ఆమె ప్రశ్నించారు. అక్కడ మన విద్యార్థులు బంకర్లలో ఉంటూ నీరు, ఆహారం దొరక్క అలమటిస్తుండగా ఎలాంటి సాయం అందించకుండా వెనక్కి రావాలంటే ఎలా సాధ్యమని ఆమె ప్రధానిని నిలదీశారు. కోవిడ్‌ సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించి వలస కార్మికులను ప్రభుత్వం అత్యంత తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు.

మరిన్ని వార్తలు