సింగరేణిపై కేంద్రం దొంగదెబ్బ 

4 Dec, 2022 01:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోదీ ప్రభుత్వం సింగరేణిని బ్లాకుల వారీగా విక్రయిస్తోందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు. ఇటీవల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని సింగరేణిని విక్రయించబోమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఈ వేలం వేశారని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

శనివారం బెంగళూరులో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో సింగరేణిలోని 4 బ్లాకులతో పాటు దేశంలోని 141 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గోదావరిఖని, మందమర్రి, బెల్లంపల్లిలో శనివారం ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేసినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు