ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటాం 

4 Dec, 2022 01:13 IST|Sakshi
అమరవీరుల స్తూపం వద్ద  నివాళులు అర్పిస్తున్న షర్మిల  

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 

నాంపల్లి (హైదరాబాద్‌): నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే సీఎం కేసీఆర్‌ ఇక్కడి ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం చేశారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. శనివారమిక్కడ గన్‌పార్కు వద్ద శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్కరి ప్రాణం ఎంతో విలువైనదని, ప్రతి బిడ్డ మరణాన్ని స్మరించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తాము అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు.  లిక్కర్‌ స్కామ్‌లో సీఎం కేసీఆర్‌ బిడ్డ ఉందని, రియల్‌ ఎస్టేట్‌ స్కామ్‌లో కొడుకు, కమీషన్ల స్కామ్‌లో కేసీఆర్‌ ఉన్నారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబంపై ఈడీ, ఐటీ సోదాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

షర్మిల పాదయాత్రపై షోకాజ్‌ నోటీసు 
వరంగల్‌ క్రైం: వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి క్రాస్‌ నుంచి ఆదివారం పాదయాత్రను పునఃప్రారంభించేందుకు అను మతి కోరుతూ షర్మిల చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దంటూ పోలీసులు షోకా జ్‌ నోటీసులు జారీచేశారు. పాదయాత్రకు మొదటిసారి అనుమతి ఇచ్చినప్పుడు సూచించిన నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగత దూషణకు పాల్పడటం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని అందులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు