నా ఫాంహౌజ్‌ దున్నడానికి బండి సంజయ్‌ ట్రాక్టర్‌ డ్రైవరా?: సీఎం కేసీఆర్‌

8 Nov, 2021 18:09 IST|Sakshi

KCR Comments On Bandi Sanjay: దేశ ఖజానాలో తెలంగాణ సొత్తు కూడా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశ ఖజానా నీ అయ్య సొత్తు ఏమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఉద్ధేశించి ఆయన మండిపడ్డారు. తన ఫాంహౌజ్‌ను దున్నడానికి బండి సంజయ్‌ ఏమైనా ట్రాక్టర్‌ డ్రైవరా? అని చురకలంటించారు. తమకు మనీలాండరింగ్‌లు లేవని.. కంపెనీలు లేవు, బిజినెస్‌లు, దందాలు లేవని అన్నారు. బీజేపీ నేతలు తమను ఏం చేయలేదని, వారి బెదిరింపులకు భయపడమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాము ఎవరితోనైనా, ఎంత దాకా అయినా పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని ఉద్యమం సాగించిన చరిత్ర మరచిపోవద్దని అన్నారు.
చదవండి: తెలంగాణ వడ్లను కొంటారా.. కొనరా చెప్పాలి: సీఎం కేసీఆర్‌

‘దళితుడిని సీఎంను చెస్తానని చెప్పి చేయలేదని అంటున్నారు. నేను మళ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఆమెదించారు కదా.. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.  తెలంగాణకు కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. తామే దళితుడిని సీఎంని చేయనివ్వలేదని షబ్బీర్‌ అలీయే ఓ సందర్భంలో చెప్పారు. ఆ తరువాత కూడా ప్రజలు నా నిర్ణయాన్ని ఆమోదించారు. తెలంగాణకు బీజేపీ, బండి సంజయ్‌ ఏం చేశారో చెప్పాలి. దేశంలో ఏ వర్గం ప్రజలకు, ఏ జాతికి మీరు మేలు చేశారు. మేము లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు