Trending Telugu News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

4 Jul, 2022 09:57 IST|Sakshi

1. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీ పర్యటనకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పాకిస్తాన్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?
సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్‌ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్‌ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. బాబుతో దోస్తీ.. కాపులకు న్యాయమేది? పవన్‌ను ప్రశ్నించిన కాపు ఐక్యవేదిక
జనవాణి కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ వైఖరినే ప్రశ్నిస్తూ కాపు ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది. కాపు రిజర్వేషన్ల అంశం సహా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని అందులో డిమాండ్‌ చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు!
కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. పదేపదే పార్టీ లైన్‌ దాటుతూ వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిపై చర్యలు కఠినంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సభ సక్సెస్‌.. బీజేపీకి టానిక్‌! 
బీజేపీ ప్రధాని మోదీతో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’బాగా విజయవంతమైం దని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది మంది తరలిరావడం, ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భుజం తట్టడం, ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరపడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వారిద్దరూ ఎలా కలిసి ఉంటారో చూస్తా.. నరేష్‌ మూడో భార్య  రమ్య శపథం
తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్‌ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఆఖరి టెస్టులో భారత్‌ ‘పట్టు’.. చతేశ్వర్‌ పుజారా అర్ధసెంచరీ
గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్‌ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్‌ అడుగులేస్తోంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్‌లో చతేశ్వర్‌ పుజారా అర్ధసెంచరీతో టీమిండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది?
సాధారణంగా షాపింగ్‌కో, ఆన్‌లైన్‌ పేమెంట్లకో క్రెడిట్‌ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్‌లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్‌స్టంట్‌ లోన్‌/పేమెంట్‌ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్‌ పెయిడ్‌) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే!
ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్‌ విభూతిరాతిమత్‌ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్‌’’ అంటాడు గీతాచార్యుడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు