'రాధాకృష్ణ ఛానెల్, పేపర్ నడపడానికి అనర్హుడు'

20 Nov, 2020 14:26 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎన్నారై పార్టీగా తయారయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్ ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. పక్క రాష్ట్రాలతో కేసులు వేయించారు. పోలవరం భూసేకరణ పూర్తి కాకుండా అడ్డుపడ్డారు. పోలవరం దగ్గర 150 అడుగుల వైఎస్సార్ విగ్రహం పెడతామంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయి..?. 2021 డిసెంబర్‌కు పోలవరం పూర్తి చేస్తాము. 

టీడీపీ తొత్తుగా నిమ్మగడ్డ
నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారు. టీడీపీ అధికార ప్రతినిదిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నిలు చంద్రబాబు పెట్టమంటే పెడుతున్నారు. వద్దంటే మానేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలు నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారు. టీడీపీ నేతలతో స్టార్ హోటల్లో కూర్చొని మంతనాలు జరిపిన వ్యక్తి నిమ్మగడ్డ. కరోనా లేని సమయంలో వాయిదా వేశారు. కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోలేదు. టీడీపీ క్యాడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డను ఎక్కుగా నమ్ముతున్నారు. నిమ్మగడ్డ పదవీ విరమణ తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు అనే అనుమానం మాకు ఉంది. చంద్రబాబును దింపి టీడీపీ నేతలు నిమ్మగడ్డకు పగ్గాలు అప్పగిస్తారనే అనుమానం కలుగుతుంది. పేదలకు ఇళ్లు ఇస్తామంటే దేశ చరిత్రలో అడ్డుకున్న పార్టీ టీడీపీ మాత్రమే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారు.  ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్‌ సీఎం జగన్‌')

విశాఖ ఎయిర్ పోర్ట్‌పై చర్చకు సిద్ధం
విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కాదు నేవి ఎయిర్ పోర్ట్. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి చిన్న విషయంలో నావీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ మూసేశారు. నాకు ఎలాంటి భూ లావాదేవీలాతో సంబంధం లేదు. నా పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే నాకు లేదా పోలీసులు దృష్టికి తీసుకురండి. రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వారు సమతుల్యం పాటించాలి. రాధాకృష్ణ ఛానెల్, పేపర్ నడపడానికి అనర్హుడు. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై నాతో చర్చకు వస్తే అన్ని విషయాలు చర్చిస్తాను. జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ రామోజీరావు. జర్నలిజం ముసుగు వేసుకొని ఒక పార్టీకి రాధాకృష్ణ కొమ్ము కాస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన లేఖలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేవేయలని ఉంది. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై రామోజీరావు, రాధాకృష్ణ తో చర్చించాలా. రెండు ఎయిర్ పోర్ట్‌ల మధ్య ఎంత దూరం ఉండాలో తెలియదా.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: అవంతి
పరిశ్రమల ప్రోత్సాహం అభివృద్ధి సమస్యలపై రేపు జిల్లా సమావేశం జరుగుతుంది. అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమన్నట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాలుగా పరిశ్రమల అభివృద్ధికి మేము సిద్ధంగా ఉన్నాము. విశాఖ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. శుక్రవారం జరిగే సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ రీ స్టార్ట్ పేరుతో ఈ కార్యక్రమం రూపొందించారు అని మంత్రి అవంతి పేర్కొన్నారు.  (తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్‌)

నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది..?: కన్నబాబు
చంద్రబాబుకు యనమల కో పైలెట్‌ లాంటివారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు అన్నారు. 'యనమల స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్‌లా కాకుండా రమేష్‌ కమిషన్‌లా నిమ్మగడ్డ పనిచేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. చంద్రబాబు ఏం చెపితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారు. ఎన్నికలు అంటే వైఎస్సార్‌సీపీకి భయం లేదు. ఎన్నికలకు మేము భయపడలేదు, ప్రజల ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకుంటున్నాము. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం ఏముంది. చంద్రబాబు హయాంలో జరగాల్సిన ఎన్నికలను ఎందుకు నిమ్మగడ్డ నిర్వహించలేదు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ స్వతంత్ర ప్రతిపత్తి ఏమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ('బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే') 

మరిన్ని వార్తలు