రామోజీపై ఎలాంటి కేసులు పెట్టినా వెంటనే స్టే తెచ్చుకోగలరు: ఉండవల్లి

7 Nov, 2022 11:48 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ఈనాడు రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శికి డిపాజిట్లు సేకరించే హక్కు లేదు. మార్గదర్శికి, రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. బ్యాలెన్స్‌ షీట్‌లో ఛైర్మన్‌గా రామోజీరావు సంతకం చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించే హక్కు మార్గదర్శికి లేదు. మార్గదర్శికి రామోజీరావుకు సంబంధం లేదంటూనే.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడ్‌విట్‌లో మార్గదర్శి నాదే అని రామోజీ సంతకం చేశారు. సెక్షన్‌ 10 ప్రకారం ఏ చిట్‌ఫండ్‌ కంపెనీ వేరే వ్యాపారం చేయకూడదు. రామోజీరావు మార్గదర్శి డబ్బులను మిగతా వ్యాపారాలకు వాడుకున్నారు. హెచ్‌యూఎఫ్‌ డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధం. 

చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్న రామోజీ ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనేది పచ్చి అబద్ధం. చట్టం అనేది కొరడా లాంటిది. కోర్టులో ఒకసారి చిట్‌ఫండ్‌ తనే అని రామోజీ అన్నారు.. మరోసారి కాదన్నారు. నేను చెప్పే ప్రతీ అంశానికి డాక్యుమెంటరీ ఆధారం ఉంది. మార్గదర్శి రామోజీదా? కాదా? అనేది తేల్చాలి. రామోజీరావుకు చిట్‌ఫండ్‌ కంపెనీకి సంబంధం ఉందా లేదా?. మార్గదర్శితో రామోజీకి సంబంధం లేకుంటే కేసు విత్‌డ్రా చేసుకుంటాను. రామోజీపై ఎలాంటి కేసులు పెట్టినా వెంటనే స్టే తెచ్చుకోగలరు. రామోజీరావు లాంటి వ్యక్తితో పెట్టుకోవడానికి ఎవరూ సాహసించరు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు