మహిళలకు రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలి 

27 Nov, 2022 00:51 IST|Sakshi
రాందేవ్‌ బాబా దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మహిళాకాంగ్రెస్‌ నేతలు 

మహిళాకాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని మహిళలందరికీ రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సునీతారావు డిమాండ్‌ చేశారు. రాందేవ్‌బాబా వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం గాంధీభవన్‌ ఎదుట మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఈ ఆందోళనలో మహిళానేతలు రాందేవ్‌బాబా దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అనంతరం రాందేవ్‌బాబాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు