‘ఆడి కార్లలో వచ్చి పాదయాత్ర చేసేవారిని రైతులు అంటామా?’

13 Sep, 2022 21:10 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అమరావతిలోనే సంపద సృష్టించాలా? మిగతా ప్రాంతాలకు అర్హత లేదా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆడికార్లలో వచ్చి పాదయాత్ర చేసేవారిని రైతులు అంటామా? అని దుయ్యబట్టారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు కారకుడైన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: ‘రాజధాని పేరుతో సెలెక్ట్‌.. ఎలెక్ట్‌.. కలెక్ట్‌ యాత్ర’

సంక్షేమం, అభివృద్ధితో దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రజలకు ధైర్యం కల్పించారు. చంద్రబాబు తనకు తాను విజన్‌ ఉన్న వ్యక్తిగా ప్రచారం చేయించుకుంటారు. అమరావతికి వ్యతిరేకంగా మేం ఏ రోజూ మాట్లాడలేదు. అమరావతితో పాటు కర్నూలు, విశాఖ రాజధానులుగా ఉండాలని ఆలోచిస్తున్నాం. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలనేదే మా అభిమతం అని’’ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు