విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

24 Dec, 2023 01:44 IST|Sakshi
విజేతలకు బహుమతులు అందిస్తున్న ఎమ్మెల్యే కేపీ, పక్కన విద్యాశాఖాధికారులు

మార్కాపురం టౌన్‌: విద్యార్థులు చదువుతోపాటు సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను చేస్తూ శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, గుంటూరు విద్యాశాఖ ఆర్జేడీ సుబ్బారావు అన్నారు. శనివారం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. జిల్లా స్థాయికి 190 ఆవిష్కరణలు వచ్చాయని వీటిలో వ్యక్తిగత, గ్రూపు క్యాటగిరితోపాటు 38 టీచర్‌ క్యాటగిరీలు వచ్చాయన్నారు. ముందుగా టెట్రా సైక్‌లైన్‌ కనుగొన్న తెలుగు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, డీఎల్‌డీఓ సాయికుమార్‌, డిప్యూటీ డీఈఓలు చంద్రమౌళీశ్వర్‌, అనీతారోజ్‌ రాణి, ఎంపీడీఓ చందన, జాతీయ ఉత్తమ సైన్స్‌ అవార్డు గ్రహిత జగన్నాఽథ్‌, ఎంఈఓలు రాందాస్‌ నాయక్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

100 శాతం ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి

మార్కాపురం: వచ్చే ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే విద్యార్థుల 100 శాతం ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఈఓ సుబ్బారావు తెలిపారు. శనివారం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 38 మండలాల్లో 29,466 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. ప్రత్యేక స్టడీ అవర్స్‌తోపాటు జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వర్‌, హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓలు రాందాస్‌ నాయక్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ౖసైన్స్‌ ఫెయిర్‌ విజేతలు

మార్కాపురం టౌన్‌: వ్యక్తిగత క్యాటగిరీలో మొదటి బహుమతిని జి. శివకౌశిక్‌, డి. సాత్విక్‌, సీహెచ్‌ దేవరాజు, రెండో బహుమతిని జీవీ అభిరామ్‌, బి. లక్ష్మీ ప్రియ, కె. గౌతమి, మూడో బహుమతిని సీహెచ్‌ వసంతకుమార్‌, డి. నివాస్‌, కె. నితీష్‌ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. గ్రూపు క్యాటగిరీలో మొదటి బహుమతి ఎస్‌కే జమీర్‌, మణికంఠ, వెంకట్‌, నరసింహ, కె. శ్రావణి, ఇ. శ్రీజ, ద్వితీయ బహుమతిని డి. ధనలక్ష్మి, హారిక, ఎస్‌ నిఖిల్‌, కె. శ్రీనివాసులు, టి. వీరబ్రహ్మం, తృతీయ బహుమతిని ఎం. అంజలి గెలుపొందారు.

టీచర్స్‌ క్యాటగిరీలో..

ప్రథమ బహుమతి ఎం. లక్ష్మీ కాంతమ్మ, పి. ప్రమీల , కె. రాము, ద్వితీయ బహుమతిని కె. పద్మజ, కె. స్వర్ణలత, ఎస్‌.కె సికిందర్‌ బాషా, తృతీయ బహుమతిని జి. రాజగోపాల్‌, ఏ. ఉమా మహేశ్వరి, జి. ప్రభాకర్‌ విజేతలుగా నిలిచారు. సైన్స్‌ఫెయిర్‌కు హాజరైన విద్యార్థులకు పార్టిసిపేషన్‌ బహుమతులను అందించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, సబ్‌కలెక్టర్‌ రాహుల్‌మీనా, ఆర్జేడీ సుబ్బారావు, పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు