జైసల్మేర్‌ టు మంగళూరు 

15 Feb, 2023 00:59 IST|Sakshi

మంగళూరుకు షిఫ్ట్‌ అయ్యారు జైలర్‌. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొం దుతున్న సినిమా ‘జైలర్‌’. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపా త్రలు పో షిస్తున్న చిత్రం ఇది.

ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగింది. ఈ షెడ్యూల్‌లో రజనీ, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ‘జైలర్‌’ షూటింగ్‌ మంగళూరులో జరుగుతోంది. రజనీ, శివరాజ్‌కుమార్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లా న్‌ చేశారట. 

మరిన్ని వార్తలు