World Masters Athletics: 94 ఏళ్ల వయసులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్‌

11 Jul, 2022 21:27 IST|Sakshi

ఫిన్‌లాండ్‌ వేదికగా జరిగిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్‌-2022లో భారత అథ్లెట్‌ భగవానీ దేవీ సంచలనం సృష్టించింది. 94 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించి ఔరా అనిపించింది. 35 ఏళ్లు పైబడిన వారు పోటీ పడిన ఈ రేసును భగవానీ దేవీ 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది.

లేటు వయసులో సాధించిన ఘనతకు గాను భగవానీ దేవీకి విశ్వం నలుమూలల నుంచి నీరాజనాలు అందుతున్నాయి. ఏదైనా సాధించేందుకు వయసుతో సంబంధం లేదని భగవానీ దేవీ మరోసారి నిరూపించిందని అభినందనలు అందుతున్నాయి. భగవానీ దేవీ సాధించిన ఘనతను కొనియాడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ ట్విట్‌ చేసింది. నెటిజన్లు భగవానీ దేవీని ఆకాశానికెత్తుతున్నారు. సోషల్‌మీడియాలో భగవానీ దేవీ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.   
చదవండి: ప్రపంచకప్‌ బరిలో నుంచి టీమిండియా ఔట్‌

మరిన్ని వార్తలు