అభిమాన హీరోని కలుసుకున్న నీరజ్‌ చోప్రా

25 Aug, 2021 21:48 IST|Sakshi

ముంబై: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా బుధవారం తన అభిమాన హీరో రణ్‌దీప్‌ హుడాని పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్‌ హుడా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ.. నీరజ్‌ను ఆకాశానికెత్తాడు. కాగా, నీరజ్‌2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన అనంతరం మీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందని మీడియా ప్రశ్నించగా.. రణ్‌దీప్‌ హుడా అయితే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. నీరజ్‌, హూడా ఇద్దరూ హర్యానా రాష్ట్రానికే చెందిన వారే కావడం, అలాగే ఇద్దరికీ క్రీడలంటే అమితమైన ఆసక్తి ఉండడంతో వారి మధ్య స్నేహం బలపడింది. 

ఇదిలా ఉంటే, నీరజ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక  ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంగీ​ష్‌, పంజాబీ, హిందీ భాషల్లో సినిమాలు చూస్తానని, తన ఫేవరెట్‌ హీరో రణ్‌దీప్‌ అని, అతను నటించిన 'లాల్‌రంగ్‌' అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. లాల్‌రంగ్‌ సినిమా మొత్తం హరియాణా యాసలో ఉండటంతో అది బాగా నచ్చిందని, అలాగే రణదీప్‌ నటించిన 'సర్బజీత్‌', 'హైవే' తనను చాలా ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. 
చదవండి: ఫైన‌ల్‌కు ముందు నీర‌జ్‌ జావెలిన్‌ను ఆ పాకిస్తానీ ఎందుకు తీసుకెళ్లాడు?

మరిన్ని వార్తలు