Aus Vs Eng: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. ఆసీస్‌ జట్టు ప్రకటన.. ప్రపంచకప్‌ లక్ష్యంగా!

8 Nov, 2022 09:28 IST|Sakshi
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌.. ఆసీస్‌ జట్టు ప్రకటన (PC: CA Twitter)

Australia Vs England ODI Series 2022: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకాలు షురూ చేసింది. ఇందులో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడనుంది. నవంబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ సిరీస్‌ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం తమ జట్టును ప్రకటించింది.

కొత్త సారథిగా ప్యాట్‌ కమిన్స్‌ ప్రస్థానం మొదలు
ఆరోన్‌ ఫించ్‌ వన్డేలకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తొలిసారిగా వన్డే సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఫించ్‌ గైర్హాజరీలో ఓపెనర్‌ స్థానానికి ట్రవిస్‌ హెడ్‌ను ఎంపిక చేసింది యాజమాన్యం. 

వరల్డ్‌కప్‌ టోర్నీ కోసం
సుదీర్ఘకాలం తర్వాత అతడు జట్టులో పునరాగమనం చేయడం గమనార్హం. అదే విధంగా పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లకు 14 మంది సభ్యులు గల ఈ జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలక్టర్‌ జార్జ్‌ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘వన్డే కొత్త కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో వరల్డ్‌కప్‌ నాటికి జట్టును బలోపేతం చేయడమే లక్ష్యం.

మాకిది ముఖ్యమైన సిరీస్‌. ఫించ్‌ స్థానంలో ట్రవిస్‌ హెడ్‌ జట్టులోకి వచ్చాడు. ఇండియాలో వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధం కావడంపైనే ప్రస్తుతం మేము దృష్టి సారించాం’’ అని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌- షెడ్యూల్‌
నవంబరు 17, గురువారం- అడిలైడ్‌
నంబరు 19, శనివారం, సిడ్నీ
నవంబరు 22, మంగళవారం, మెల్‌బోర్న్‌

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌- ఆస్ట్రేలియా జట్టు ఇదే
ప్యాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), ఆష్టన్‌ అగర్‌, అలెక్స్‌ కారీ(వికెట్‌ కీపర్‌), కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, మార్నస్‌ లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టొయినిస్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడం జంపా.

చదవండి: T20 WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్‌ సమరం.. టీమిండియాలో రెండు మార్పులు..?
T20 WC 2022: టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న 1992 సెంటిమెంట్‌..!

మరిన్ని వార్తలు