తేజస్విన్‌కు అనుమతి

23 Jul, 2022 02:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత హైజంప్‌ ప్లేయర్‌ తేజస్విన్‌ శంకర్‌కు నిర్వాహకులు అనుమతించారు. ఒకే ఈవెంట్‌లో వైదొలిగిన ప్లేయర్‌ స్థానంలో మరొకరికి అనుమతి ఇస్తామని గతంలో తేజస్విన్‌ ఎంట్రీని నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే శుక్రవారం డెలిగేట్‌ రిజిస్ట్రేషన్‌ మీటింగ్‌ ముగిశాక తేజస్విన్‌ ఎంట్రీకి పచ్చజెండా ఊపారు.

స్వదేశంలో సెలెక్షన్‌ టోర్నీలో తేజస్విన్‌ బరిలోకి దిగలేదు. అయితే అతను కామన్వెల్త్‌ గేమ్స్‌ అర్హత ప్రమాణాన్ని అమెరికాలో నేషనల్‌ కాలేజియట్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో నమోదు చేశాడు. కానీ భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) తేజస్విన్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా అతనిని ఎంపిక చేయలేదు. దాంతో తేజస్విన్‌ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. చివరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఏఎఫ్‌ఐ అధికారులు తేజస్విన్‌ పేరును కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వాహకులకు పంపించారు.

మరిన్ని వార్తలు