భారత పురుషుల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌గా ఫుల్టన్‌ 

4 Mar, 2023 01:17 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త చీఫ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్‌ ఫుల్టన్‌ను నియమిస్తున్నట్లు హాకీ ఇండియా  అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ ప్రకటించారు. 48 ఏళ్ల ఫుల్టన్‌ దక్షిణాఫ్రికా తరఫున 195 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్, 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

క్రీడాకారుడిగా రిటైరయ్యాక కోచింగ్‌వైపు మళ్లిన ఫుల్టన్‌ 2014 నుంచి 2018 వరకు ఐర్లాండ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఫుల్టన్‌ శిక్షణలో ఐర్లాండ్‌ వందేళ్ల తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 2015లో ఆయన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వార్షిక అవార్డుల్లో ఉత్తమ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఫుల్టన్‌ బెల్జియం జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా కూడా పని చేశాడు.

శిక్షణ బృందంలో    ఫుల్టన్‌ సభ్యుడిగా ఉన్నపుడు బెల్జియం 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2018 ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధించింది. గత జనవరిలో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. టీమిండియా నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో చీఫ్‌ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ తన పదవికి రాజీనామా చేశాడు.  

మరిన్ని వార్తలు