బంతిని అందుకునే తాపత్రయం.. బొక్కబోర్లా పడ్డాడు

21 May, 2021 19:10 IST|Sakshi

లండన్‌: జెంటిల్మన్‌ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్‌లో ఫన్నీ మూమెంట్స్‌ జరగడం సహజమే. ఒక్కోసారి ఎవరు ఊహించిన విధంగా జరిగితే నవ్వులు పూయడం ఖాయం. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌ క్రికెట్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే..  శుక్రవారం కెంట్‌, గ్లామోర్గాన్‌ మధ్య మ్యాచ్‌​ జరిగింది. కెంట్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌ను ఆస్ట్రేలియన్‌ బౌలర్‌ మైకెల్‌ నెసెర్‌ వేశాడు. నెసెర్‌ వేసిన బంతిని ఇంగ్లండ్‌ ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్‌ ఫైన్‌లెగ్‌ దిశగా ఆడాడు. బ్యాట్స్‌మెన్‌ ఇద్దరు కూల్‌గా సింగిల్‌ కంప్లీట్‌ చేశారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్‌ చోటుచేసుకుంది. డీప్‌లో ఉన్న ఫీల్డర్‌ కీపర్‌ కమ్‌ కెప్టెన్‌ క్రిస్‌ కూక్‌కు త్రో విసిరాడు. అయితే అతను బంతిని రాంగ్‌ సైడ్‌లో వేయగా... దానిని అందుకునే ప్రయత్నంలో క్రూక్‌ వికెట్‌ స్టంపింగ్స్‌ను పట్టించుకోలేదు. ఇంకేముంది.. బంతిని అందుకున్నాడు గానీ అప్పటికే వికెట్ల పై నుంచి దాటుతూ బొక్కబోర్లా పడ్డాడు. కూక్‌ ప్యాంట్‌కు చిక్కుకొని రెండు వికెట్లు మొత్తం బయటికి వచ్చాయి. కెప్టెన్‌ చేసిన పనికి అతని సహచర ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. ఈ వీడియోనూ గ్లామోర్గాన్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తన ఫన్నీ చర్యతో తన సహచరులకు నవ్వు తెప్పించిన కూక్‌ కెప్టెన్‌గా.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో గ్లామోర్గాన్స్‌ తరపున 365 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కూక్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 45 ఓవర్ల ఆట ముగిసేసరికి కెంట్‌ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. గ్లామోర్గాన్స్‌ బౌలర్‌ మైకెల్‌ నెసెర్‌(15-10-15-4) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 
చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్‌గా కొట్టేశాడు

'పో.. వెళ్లి బౌలింగ్‌ చేయ్‌ బ్రో'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు