న‌రేంద్ర మోదీ ఒక హీరో.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ప్ర‌శంస‌లు వర్షం

24 Sep, 2021 18:05 IST|Sakshi

Kevin Pietersen Comments ON Narendra Modi: భారత ప్రధాని న‌రేంద్ర మోదీపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, పర్యావరణ పరిరక్షకుడు కెవిన్ పీట‌ర్స‌న్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఖడ్గమృగాల రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను పీట‌ర్స‌న్  కొనియాడాడు. ఖడ్గమృగాలన్ని కాపాడటానికి అస్సాం ప్రభుత్వం చేస్తున్న కృషిని అతడు ప్రశంసించాడు. భారత ప్రధానిని అనుకరించాలని ఇతర ప్రపంచ నాయకులకు పీట‌ర్స‌న్ పిలుపు నిచ్చాడు. ప్రధాని న‌రేంద్ర మోదీని అతడు ఒక "హీరో" గా అభివర్ణించాడు.  "ఒక కొమ్ము గల ఖడ్గమృగం భారతదేశానికి గర్వకారణం.. దాని శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకోబడతాయి" అని ప్రధాని చెప్పారని  పీట‌ర్స‌న్ పేర్కొన్నాడు.

ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్లే భారతదేశంలో ఖ‌డ్గ‌మృగాల సంఖ్య వేగంగా పెరుగుతోంద‌ని అతడు  వెల్లడించాడు. ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం సెప్టెంబర్ 22 న, అసోం ప్రభుత్వం 2,479  ఖడ్గమృగాల కొమ్ములను బహిరంగంగా వేద ఆచారాల మధ్య దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా  అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ఒక కొమ్ము గల ఖడ్గమృగం భారతదేశానికి గర్వకారణం, దాని శ్రేయస్సు కోసం అన్ని చర్యలు తీసుకోబడతాయి ”అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

చదవండిఅతడు ఆద్భుతమైన ఆటగాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు