'నేను నిన్ను ప్రేమిస్తున్నా'.. నా భార్యకు ఏం అర్థం అయిందో!

27 May, 2021 19:32 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు ఇండియా అంటే విపరీతమైన అభిమానం. ఇప్పటికే ఇండియన్‌ సినిమాలకు సంబంధించిన పాటలు, ఫైట్స్‌, డైలాగ్స్‌ పలికి అందరిని అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే విపరీతమైన అభిమానం చూపే వార్నర్‌ మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ సినిమాల్లోని డైలాగ్స్‌, డాన్స్‌ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నాడు. తాజాగా వార్నర్‌ తన భార్య కాండీస్‌కు తెలుగులో లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. కాండీస్‌.. నేను నిన్ను ప్రేమిస్తున్నా.. అంటూ వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అయితే వార్నర్‌ లవ్‌, వైఫ్‌, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటూ హ్యాష్‌ టాగ్‌ జత చేశాడు. వార్నర్‌ రాసిన కామెంట్‌ కాండీస్‌కు అర్థం అయిందో లేదో తెలియదు. అతని హ్యాష్‌ ట్యాగ్స్‌ను బట్టి విషయాన్ని గ్రహించిన కాండీస్‌.. లవ్‌ సింబల్‌తో రిప్టై ఇచ్చింది. 

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో ఆసీస్‌ చేరుకున్న వార్నర్‌ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ జరుగుతున్న సమయంలోనే డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్నర్ స్థానంలో కేన్‌ విలియమ్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. లీగ్‌ రద్దయ్యే సమయానికి 7 మ్యాచ్‌లాడి 6 ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
చదవండి: వార్నర్‌ మళ్లీ మొదలుపెట్టాడు.. ఈసారి రౌడీ బేబీతో

'రాములో రాములా' పాటకు వార్నర్‌ డ్యాన్స్‌.. ట్రోల్‌ చేసిన భార్య

A post shared by David Warner (@davidwarner31)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు