Manan Sharma: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఢిల్లీ ఆల్‌రౌండర్‌

21 Aug, 2021 10:35 IST|Sakshi

ఢిల్లీ: భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ మనన్‌ శర్మ భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విదేశీ లీగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని.. అందుకే భారత క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా త్వరలోనే యూఎస్‌ మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ ఆడేందుకు కాలిఫోర్నియా బయలుదేరి వెళుతున్నట్లు మనన్‌ శర్మ స్ఫష్టం చేశాడు.
చదవండి: భారత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఉన్ముక్త్‌ చంద్‌

2017లో ఢిల్లీ తరపున భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మనన్‌ శర్మ 35 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 1208 పరుగులు(ఒక సెంచరీ.. 8 అర్థసెంచరీలు) ,113 వికెట్లు తీశాడు.ఇక లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 560 పరుగులు చేసిన మనన్‌ శర్మ 26 టీ20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీశాడు. ఇక 2016లో మనన్‌ శర్మను రూ.10 లక్షల కనీస ధరకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కాగా ఢిల్లీ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, గౌతమ్‌ గంభీర్‌లతో మనన్‌ శర్మ డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకున్నాడు.

కాగా మనన్‌ శర్మ తండ్రి అజయ్‌ శర్మ భారత మాజీ క్రికెటర్‌ అన్న సంగతి తెలిసిందే. 1988లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అజయ్‌ శర్మ టీమిండియా తరపున 31 వన్డేలు.. ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2000వ సంవత్సరంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతలో దోషిగా తేలిన అజయ్‌ శర్మపై జీవితకాల నిషేదం పడింది. అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరమయ్యాడు. 

చదవండి: నీరజ్‌ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్‌ ఆగ్రహం

మరిన్ని వార్తలు