Formula One: 'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు'

24 Feb, 2022 13:30 IST|Sakshi

ఫార్ములావన్‌ ఫాలో అయ్యేవారికి క్రిస్టియన్‌ హార్నర్‌.. పరిచయం అక్కర్లేని పేరు. 2005 నుంచి రేసింగ్‌లో ఉన్న క్రిస్టియన్‌ హార్నర్‌ ఖాతాలో తొమ్మిది వరల్డ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. అందులో నాలుగు వరల్డ్‌ కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్స్‌.. మిగతా ఐదు వరల్డ్‌ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటిష్‌ టీమ్‌ రెడ్‌బుల్‌ ఫార్ములావన్‌ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో క్రిస్టియన్‌ హార్నర్‌ ఫార్ములావన్‌ ఫాలో అవుతున్న యువతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫార్ములా వన్‌ చూసేందుకు అమ్మాయిలు ఎగబడుతున్నారని..  అయితే అది ఆటపై ఇష్టంతో కాదని.. అందమైన ఫార్ములా వన్‌ డ్రైవర్లను చూసేందుకే వస్తున్నారంటూ పేర్కొన్నాడు. క్రిస్టియన్‌ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. 

టాక్‌స్పోర్ట్స్‌కు చెందిన న్యూజ్‌ ప్రెజంటేటర్‌ లారా వుడ్స్‌కు క్రిస్టియన్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు. '' ఫార్ములావన్‌ ఇప్పుడు ఉత్సాహంగా ఉన్న యువకులను ప్రోత్సహిస్తుంది. యంగ్‌ జనరేషన్‌పై ఫోకస్‌ పెట్టింది. కానీ ఫార్ములావన్‌ ఫాలో అవుతున్న యువతులు మాత్రం డ్రైవర్లపై ఫోకస్‌ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడొస్తున్న యంగ్‌ డ్రైవర్లు మంచి లుక్‌తో కనిపిస్తున్నారు. కేవలం వారిని చూసేందుకు పార్ములా వన్‌కు ఎగబడుతున్నారు.. ఆటపై ఇష్టంతో మాత్రం కాదు'' అంటూ పేర్కొన్నాడు. 

క్రిస్టియన్‌ సమాధానం విన్న లారా వుడ్స్‌ అతనికి ధీటుగా కౌంటర్‌ ఇచ్చింది. ''ఫార్ములా వన్‌ను యువతులు ఎక్కువగా చూస్తున్నారని మీరన్న మాట నిజమే.. కానీ డ్రైవర్లపై మోజుతో మాత్రం కాదు.. ఆటను చూసి యువతులు కూడా గొప్ప రేసర్లుగా మారాలని అనుకుంటున్నారు.'' అంటూ పేర్కొంది. కాగా క్రిస్టియన్‌ వ్యాఖ్యలపై అన్ని వైపలు నుంచి విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరాడు.
చదవండి: 423 రోజుల తర్వాత గ్రౌండ్‌లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం

డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్‌ వేసి ఆడేవాడిని.. 

మరిన్ని వార్తలు