Gerd Muller: జర్మనీ ఫుట్‌బాల్‌ దిగ్గజం గెర్డ్‌ ముల్లర్‌ కన్నుమూత

15 Aug, 2021 19:32 IST|Sakshi
యుక్త వయసులో గెర్డ్‌ ముల్లర్‌

బెర్లిన్‌: జర్మనీ ఫుట్‌బాల్‌ దిగ్గజం గెల్డ్‌ ముల్లర్‌(75) ఆదివారం కన్నుమూశాడు. ఫుట్‌బాల్‌ చరిత్రలో బెస్ట్‌ స్ట్రైకర్‌గా పేరు పొందిన ముల్లర్‌ 1974లో జర్మనీ ఫిఫా ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో విన్నింగ్‌ గోల్‌ కొట్టిన ముల్లర్‌ జర్మనీకి ప్రపంచకప్‌ అందించాడు. ఓవరాల్‌గా జర్మనీ తరపున 62 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన ముల్లర్‌ 68 గోల్స్‌ చేశాడు. 1970లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో 14 గోల్స్‌ చేసి ఆల్‌టైమ్‌ గోల్‌ స్కోరింగ్‌తో ముల్లర్‌ రికార్డు సృష్టించాడు.

ఇక 1964 నుంచి బేయర్న్‌ మ్యూనిచ్‌ క్లబ్‌కు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ముల్లర్‌ 594 మ్యాచ్‌ల్లో 547 గోల్స్‌ చేశాడు. 2004లో ఫిఫా అత్యుత్తమ క్రీడాకారుల జాబితాలో ముల్లర్‌కు చోటు దక్కింది.

మరిన్ని వార్తలు