Hanuma vihari: అందరమూ ఒకరికి సాయం చేయొచ్చు!

11 Jun, 2021 13:36 IST|Sakshi

కరోనా సంక్షోభంలో విశేష సేవలందించిన హనుమ విహారి

హనుమా విహారి  ఫౌండేషన్‌ లోగో పరిచయం

అందరం ఐక్యంగా సాయం చేద్దాం: హనుమ విహారి

సాక్షి,న్యూఢిల్లీ: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌ హనుమ విహారి పలువురి ప్రశంసలందుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్‌ వేవ్‌లో హనుమ విహారి అనేక మంది బాధితులకు సాయం చేసి రియల్‌ హీరోగా నిలిచారు. ఈ క్రమంలో హనుమ విహారి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తాజాగా ఈ ఫౌండేషన్‌ లోగోను ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ లోగోను పరిచయం చేస్తూ "మనం అందరికీ సాయం చేయలేకపోవచ్చు.కానీ ప్రతీవాళ్లు కొందరికి సాయం చేయొచ్చు’’ రోనాల్డ్‌ రీగన్‌ మాటలను కోట్‌ చేశారు. ‘అందరం ఐక్యమవుదాం. కలిసికట్టుగా సాయపడదాం’ అని  విహారి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కాగా  తన ఫౌండేషన్‌ ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ, రక్తదానం లాంటి  విశేష సేవలను అందిస్తున్నారు హనుమ విహారి. ఇంకా కేన్సర్‌ పీడితులు, అనేక మంది చిన్నారులకు సాయం అందిస్తూ భరోసానిస్తున్నారు. 24 గంటలూ బాధితులకు అండగా ఉంటూ ఆయన అందిస్తున్న సేవలు ఆయన ట్విటర్‌ టైం లైన్‌ పరిశీలిస్తే అర్థమవుతాయి. అంతేకాదు తనతోపాటు సాయం చేసేలా పదిమందిని ప్రోత్సహిస్తుండటం విశేషం.

చదవండి: ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి హనమ విహరి ఆర్ధిక సాయం
పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్‌

మరిన్ని వార్తలు