తండ్రైన హార్దిక్‌ పాండ్యా..

30 Jul, 2020 16:31 IST|Sakshi

ముంబై : భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తండ్రి అయ్యాడు. అతనికి కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ గురువారం పండంటి బాబుకు జన్మనించారు. ఈ విషయాన్ని హార్దిక్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. దీంతో కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, కృనాల్‌ పాండ్యా, సారా టెండూల్కర్‌, సోనాల్‌ చౌహాన్‌.. సహా పలువురు ప్రముఖులు కూడా హార్దిక్‌, నటాషా జంటకు కంగ్రాట్స్‌ తెలిపారు. మరోవైపు అభిమానులు జూనియర్‌ హార్దిక్‌ వచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. (నటాషా.. అంత గ్లో ఎలా వచ్చింది?)

హార్దిక్‌, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. తమ జీవితంలో ఈ కొత్త దశ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఈ సమయంలో అభిమానుల ఆశీస్సులు, ప్రేమ కావాలని కోరారు.  (ధోనిపై ఒత్తిడి ఎంత‌ ఉందో అప్పుడే తెలిసింది)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు