గుజ‌రాత్ ఆస్ప‌త్రిలో హార్దిక్ సెల‌బ్రేష‌న్స్

5 Aug, 2020 18:27 IST|Sakshi

గాంధీ న‌గ‌ర్‌: టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ప్రేయ‌సి న‌టాషా జూలై 30న‌ మ‌గ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ ప్ర‌పంచంలోకి తమ కొడుకును తీసుకువ‌చ్చినందుకు ఆసుప‌త్రి వైద్యులకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ హార్దిక్ దంప‌తులు వేడుక చేసుకున్నారు. అయితే అంద‌రూ అనుకున్న‌ట్టుగా జూనియ‌ర్ హార్దిక్ ముంబైలో జ‌న్మించ‌లేదు. గుజ‌రాత్‌లోని ఆనంద్‌లో ఆకాంక్ష ఆసుప‌త్రిలో పుట్టాడు. సుర‌క్షితంగా అత‌డిని త‌మ చేతుల్లో ప‌ట్టిన వైద్యుల‌కు హార్దిక్ దంప‌తులు ధ‌న్య‌వావాదాలు తెలుపుతూనే, త‌మ జీవితాల్లోకి‌ అడుగు పెట్టిన బుడ్డోడికి స్వాగ‌తం ప‌లుకుతూ అదే ఆసుప‌త్రిలో సెల‌బ్రేట్ చేసుకున్నారు. (తండ్రైన హార్దిక్‌ పాండ్యా..)

వైద్యుల స‌మ‌క్షంలో కేక్ క‌టింగ్ చేశారు. ఈ మేర‌కు ప‌లు ఫొటోల‌ను హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. కాగా దుబాయ్‌లోని యాచ్‌లో హార్దిక్.. న‌టాషాకు త‌న ప్రేమ విష‌యం వెల్ల‌డించారు. ఆమె ప్రేమ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వీరిద్ద‌రూ నిశ్చితార్థం కూడా జ‌రుపుకున్నారు. కాగా బాలీవుడ్ న‌టిగా రాణిస్తోన్న‌ న‌టాషా 'బిగ్‌బాస్ 8' రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఆమె చివ‌రిసారిగా టీవీ న‌టుడు ఏలీ గోనీతో క‌లిసి 'నాచ్ బలియే 9' డ్యాన్స్ షోలో పాల్గొన్నారు. (నా గులాబీకి గులాబీలు: హార్దిక్‌)

Special thanks to Akanksha hospital in Anand! Last one week you guys made sure we have our home away from home! @niketunited @drmolinapatel @dr.nayanapatel you guys are absolute gems 🙏🏾❤️ Bringing my baby in this world! Will be grateful forever 🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు