బంగ్లాదేశ్‌ హెడ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్‌

26 Oct, 2022 18:55 IST|Sakshi

Hashan Tillakaratne: బంగ్లాదేశ్‌ మహిళా క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్‌ హసన్‌ తిలకరత్నే నియమితుడయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక మహిళా జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న తిలకరత్నే.. వచ్చే రెండేళ్ల కాలానికి బంగ్లాదేశ్‌ కోచ్‌గా విధులు నిర్వహిస్తాడని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (మహిళల క్రికెట్‌) చైర్మన్‌ నాదెల్‌ చౌధురీ వెల్లడించారు. తిలకరత్నే ఈ ఏడాది నవంబర్‌ నుంచి బాధ్యతలు చేపడతాడని నాదెల్‌ ప్రకటించారు.

కాగా, బంగ్లాదేశ్‌ మహిళా క్రికెట్‌ టీమ్‌ గత కొంతకాలంగా స్థానిక కోచ్‌లతో ప్లేయర్లకు శిక్షణ ఇప్పించేది. వీరి పర్యవేక్షణలో జట్టు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోవడంతో అనుభవజ్ఞుడైన విదేశీ కోచ్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే హసన్‌ తిలకరత్నేతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన మహిళల ఆసియా కప్‌లో బంగ్లా జట్టు పేలవ ప్రదర్శన కనబర్చి, గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. భారత్‌.. ఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.
చదవండి: న్యూజిలాండ్‌కు ఊహించని షాక్‌.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌ రద్దు

మరిన్ని వార్తలు