హైకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు

7 Jul, 2021 13:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హెచ్‌సీఏ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా బుధవారం అజారుద్దీన్‌కు naహైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవలే అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అంబుడ్స్‌మెన్‌ ఎవరనే దానిపై క్లారిటీ లేకపోవడంతోనే స్టే విధిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు అపెక్స్‌ కౌన్సిల్‌ స్థానంలో అజహర్‌ నియమించిన కొత్త సభ్యుల నియామకంపైనా హైకోర్టు స్టే విధించింది. కాగా  ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు