ఇలాంటి ప్లేస్‌‌లో 5 రోజులు ఉంటానా!

27 Feb, 2021 21:11 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి ట్రోల్స్ బారీన పడ్డాడు . భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ విజయం వెనకు అందరూ మొటేరా పిచ్‌పై విమర్శలు గుప్పించారు. కానీ ఇండియన్ కాలమిస్ట్ శోభా డే మాత్రం ఫన్నీగా రవిశాస్త్రిపై ఓ మీమ్‌ని తయారు చేసి తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. 'నేను ఈ డ్రై స్టేట్‌లో ఐదు రోజులు ఉంటానని అనుకున్నారా..? అంటూ రవిశాస్త్రి అడుగుతున్నట్లుగా ఒక పాత ఫొటోను షేర్‌ చేసింది.

దీనిని ఫన్నీగా తీసుకున్న రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. 'ఈ కఠిన సమయాల్లో ఈ ఫోటో కాస్త నవ్వు తెప్పించడం బాగుంది.  మీ పరిహాసం నాకు నచ్చింది’ అంటూ రిప్లై ఇచ్చాడు.  అంతేకాదు గుజరాత్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయాన్ని అంతర్లీనంగా శోభా డే తన ట్వీట్‌లో ప్రస్తావించింది. అయితే రవిశాస్త్రి ఫన్నీగానే తీసుకున్నా.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రం రవిశాస్త్రిపై ఫన్నీ ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. సాధారణంగా రవిశాస్త్రి విదేశీ పర్యటనల్లో బహిరంగంగానే మద్యం తాగుతూ చాలాసార్లు కనిపించాడు.కొన్నిసార్లు మ్యాచ్‌ల సమయాల్లో డ్రెస్సింగ్ రూములో  నిద్రపోతుండటం.. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత మద్యం మత్తులో వచ్చి మీడియాతో మాట్లాడటం చేసేవాడు. కాగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ మార్చి 4వ తేదీ నుంచి జరగనుంది.
చదవండి: 'థ్యాంక్స్‌ పీటర్సన్‌.. అర్థం చేసుకున్నందుకు'
మేమంతా ఏడ్చేశాం: సూర్యకుమార్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు