సాత్విక్‌–చిరాగ్‌ ఓటమి 

5 Nov, 2022 09:22 IST|Sakshi

సార్‌బ్రకెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత జంట 21–17, 18–21, 21–8తో సు యా చింగ్‌–లిన్‌ వాన్‌ చింగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీపై గెలిచింది.

అయితే పురుషుల డబుల్స్‌లో భారత మేటి జంట సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టిలకు క్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 17–21, 14–21తో బెన్‌ లేన్‌–సిన్‌ వెండీ (ఇంగ్లండ్‌) జోడీ చేతిలో కంగుతింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–13, 21–19తో ఆరో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)ని వరుస గేముల్లోనే కంగు
తినిపించాడు.  

మరిన్ని వార్తలు