Smriti Mandhana: ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా స్మృతి మంధాన

24 Jan, 2022 15:54 IST|Sakshi

భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్‌ కేవలం రెండే మ్యాచ్‌లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు విజయాల్లోనూ ఓపెనర్‌ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె... చివరి టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు చేసింది. 

అదే విధంగా.... ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 78 పరుగులు సాధించిన ఆమె... మ్యాచ్‌ డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించింది. అంతేగాక భారత్‌ గెలిచిన ఏకైక వన్డే సిరీస్‌లో 49 పరుగులతో రాణించింది. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా 15 బంతుల్లో కీలకమైన 29 పరుగులతో పాటు అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటింది. 

అంతేగాక ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో స్మృతి మంధాన 86 పరుగులు చేసింది. ఇక కంగారూలతో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ సాధించింది. ఇలా పలు మ్యాచ్‌లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మృతిని ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. ఐసీసీ వుమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021 అవార్డును ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ టమీ బేమౌంట్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs SA - Deepak Chahar: గెలిచే అవకాశం ఇచ్చాడు కానీ! కన్నీళ్లు పెట్టుకున్న దీపక్‌ చహర్‌.. వైరల్‌

మరిన్ని వార్తలు