-

IPL 2024 Release-Retention Process: ఆటగాళ్ల రిలీజ్‌ ప్రక్రియ తర్వాత ఫ్రాంచైజీల పరిస్థితి ఇలా..!

27 Nov, 2023 10:51 IST|Sakshi

ఐపీఎల్‌ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిలీజ్‌ (వదిలేయడం), రిటెన్షన్‌ (నిలబెట్టుకోవడం) ప్రక్రియకు నిన్న (నవంబర్‌ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తమ పూర్తి వివరాలను వెల్లడించాయి. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని వదిలేసిందో, ఏ ఆటగాడిని నిలబెట్టుకుందో అన్న అంశంపై నిన్నటితో పూర్తి క్లారిటీ వచ్చింది. అలాగే పర్స్‌ (బడ్జెట్‌) వివరాలు, ఇంకా ఎంత మందిని తీసుకునే వెసులుబాటు ఉందనే అంశాలపై కూడా లెక్కలు తేలాయి.

ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ తర్వాత ఫ్రాంచైజీల పరిస్థితి ఇలా ఉంది..

చెన్నై సూపర్‌ కింగ్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (68.6 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (31.4 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3).

ఢిల్లీ క్యాపిటల్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-16 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (71.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (28.95 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (9), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4).

గుజరాత్‌ టైటాన్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (23.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2).

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-13 (9 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (67.3 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (32.7 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (12), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4).

లక్నో సూపర్‌ జెయింట్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (13 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (86.85 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (13.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2).

ముంబై ఇండియన్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (84.75 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (15.25 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3).

పంజాబ్‌ కింగ్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (70.9 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (29.1 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2).

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-18 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (59.25 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (40.75 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (7), ఇందులో విదేశీ ఆటగాళ్లు (4).

రాజస్థాన్‌ రాయల్స్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-17 (12 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (85.5 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (14.5 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3).

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: ప్రస్తుత ఆటగాళ్ల సంఖ్య-19 (14 మంది దేశీయ ఆటగాళ్లు, 5 మంది విదేశీ ప్లేయర్స్‌), వెచ్చించిన మొత్తం (66 కోట్లు), పర్స్‌లో మిగిలిన మొత్తం (34 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (6), ఇందులో విదేశీ ఆటగాళ్లు (3).

ఐపీఎల్‌ 2024 వేలం తేదీ: 2023, డిసెంబర్‌ 19 
వేదిక: దుబాయ్‌
 

మరిన్ని వార్తలు