Rishabh Pant: ఇదే కదా జరగాల్సింది! ఇకపై పంత్‌ కంటే ముందు వరుసలో వాళ్లిద్దరు!

28 Dec, 2022 09:57 IST|Sakshi
రిషభ్‌ పంత్‌

India Vs Sri Lanka Series- Rishabh Pant: శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు జట్టులో చోటుదక్కలేదు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు టీ20 టీమ్‌లో ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన క్రికెట్‌ కామెంటేటర్‌ హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కాగా గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ పెద్దగా రాణించడం లేదన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ద్విశతకంతో సత్తా చాటాడు ఇషాన్‌ కిషన్‌. మరోవైపు.. గత సిరీస్‌లలో వచ్చిన ఒకటీ అరా అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకున్నాడు సంజూ శాంసన్‌.

ఇలానే కదా జరగాల్సింది
ఈ నేపథ్యంలో లంకతో  టీ20 సిరీస్‌ జట్టు ఎంపికపై హర్ష భోగ్లే ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘టీ20లలో రిషభ్‌ పంత్‌ కంటే ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ ముందు వరుసలో ఉన్నారన్నమాట! ఇలానే కదా జరగాల్సింది. 

ఇప్పుడు ఇషాన్‌ , రుతురాజ్‌, సంజూ, సూర్యకుమార్‌ టాప్‌-4లో చక్కగా సరిపోతారు. ఇక రజత్‌ పాటిదార్‌కు మాత్రం హుడా, త్రిపాఠితో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పోటీ పడాల్సి ఉంటుంది’’ అని హర్ష పేర్కొన్నాడు. కాగా రజత్‌ పాటిదార్‌ సైతం తనను నిరూపించుకుంటే జట్టులో చోటు దక్కడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, ముఖేష్ కుమార్.

మరిన్ని వార్తలు