Asian Cup 2023: భారత ఫుట్‌బాల్‌ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి

14 Jun, 2022 16:08 IST|Sakshi

ఆసియా కప్‌ 2023కి భారత ఫుట్‌బాల్‌ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత్‌ అర్హత సాధించినట్లయింది. గ్రూప్ -డిలో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టాప్‌లో ఉన్న హంగ్‌కాంగ్‌కి, భారత జట్టుకి మధ్య ఒక పాయింట్‌ మాత్రమే తేడా. ఒకవేళ హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఓడినప్పటికి ఆసియన్‌ కప్‌కు అర్హత సాధించనుంది.

1956లో ఆసియా కప్ ఆరంభం కాగా.. భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే అర్హత సాధించగలిగింది. 1964లో మొదటిసారి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఆడిన భారత జట్టు.. ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 1984లో ఆసియాకప్‌లో ఆడింది. ఆ తర్వాత 37 ఏళ్ల పాటు ఆసియాకప్‌కు అర్హత సాధించని భారత్‌.. 2011లో మూడోసారి ఆసియాకప్‌ ఆడింది. ఇక 2019లో నాలుగోసారి అర్హత సాధించిన భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టు 2023 ఆసియాకప్‌ సీజన్‌లో ఐదోసారి ఆడనుంది. 1964లో ఆసియా కప్ ఫైనల్ మినహా మరెన్నడూ భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయచలేదు.

చదవండి: రూట్‌ సెంచరీ.. ఎవరు ఊహించని సర్‌ప్రైజ్‌!

విషాదం.. క్రికెట్‌ ఆడుతూ కన్నుమూత

మరిన్ని వార్తలు