-

విజయంతోనే 'ప్రారంభం.. ముగింపు'; సూపర్‌ టీమిండియా

30 Dec, 2021 17:57 IST|Sakshi

టీమిండియా ఈ ఏడాది టెస్టుల్లో విజయాలతో ఆరంభించి.. మళ్లీ విజయంతోనే ముగించింది. కోహ్లి సారధ్యంలోని టీమిండియా ఈ  14 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. 8 విజయాలు.. 3 ఓటములు.. 3 డ్రా చేసుకుంది. ఇందులో ఒకటి న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కాగా.. మూడు సిరీస్‌లు విదేశీ గడ్డపై..  మిగిలినవి స్వదేశంలో ఆడింది. ఒకసారి ఆ విశేషాలను పరిశీలిద్దాం.

2021 ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది. అయితే గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో మాత్రం చారిత్రక విజయాన్ని అందుకుంది. కోహ్లి గైర్హాజరీలో అజింక్యా రహానే సారధ్యంలో టీమిండియా ఆసీసీ గడ్డపై నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. 

ఇక ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో సొంతం చేసుకుంది.

చదవండి: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా రాసింది ఒక చరిత్ర..

జూన్‌లో సౌతాప్టంన్‌ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. 8 వికెట్ల తేడాతో గెలిచిన కివీస్‌ తొలి డబ్య్లూటీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
 
డబ్ల్యూటీసీ అనంతరం ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా పాల్గొంది. అయితే జరిగిన నాలుగు టెస్టుల్లో రెండు విజయాలు సాధించిన టీమిండియా ఆధిక్యంలో ఉండగా.. కరోనాతో చివరి టెస్టును వాయిదా వేశారు. వాస్తవానికి టీమిండియా మరో టెస్టు డ్రా చేసుకున్నా సిరీస్‌ వశం అయ్యేది. ఈ టెస్టు వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది.

నవంబర్‌లో న్యూజిలాండ్‌ టీమిండియా పర్యటనకు వచ్చింది. రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. 

ఇక తాజగా డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా సెంచూరియన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అలా టీమిండియా ఈ ఏడాదిని విజయంతో ప్రారంభించి.. గెలుపుతోనే ఏడాది ముగించింది.

చదవండి: IND vs SA: సిరాజ్‌ మ్యాచ్‌ గెలవబోతున్నాం..  ఇలాంటివి అవసరమా!

మరిన్ని వార్తలు