ప్రాక్టీస్‌ మ్యాచ్‌తో మొదలు...

20 Jul, 2021 05:07 IST|Sakshi

నేటి నుంచి కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌తో టీమిండియా మూడు రోజుల మ్యాచ్‌

డర్హమ్‌: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్‌ సన్నాహాలను షురూ చేసింది. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టనుంది. నేటి నుంచి 3 రోజులపాటు కౌంటీ సెలెక్ట్‌ ఎలెవెన్‌ తో కోహ్లి జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆగస్టు 4 నుంచి మొదలయ్యే సిరీస్‌కు ముందు జరిగే ఏకైక ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఇదే కావడంతో పూర్తిగా ఉపయోగించుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. రెండు వారాల క్రితం కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన రిషభ్‌ పంత్‌ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగనున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు