IPL 2024: నిన్న రోహిత్‌... తాజాగా సచిన్‌ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది?

18 Dec, 2023 09:33 IST|Sakshi
PC: IPL.com

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై ఇండియన్స్‌ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. రోహిత్‌ స్ధానంలో హార్దిక్‌ పాండ్యాను తమ జట్టు కొత్త సారథిగా ముంబై ఫ్రాంచైజీ నియమించింది. ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలిగించడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ముంబై ఫ్రాంచైజీకి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల ఆసంతృప్తిగా ఉన్న క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ పదవికి రాజీనామా చేయనున్నాడన్నది ఆ వార్త సారంశం. సచిన్‌ తన నిర్ణయాన్ని ముంబై యాజమాన్యానికి తెలియజేసినట్లు ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.

క్లారిటీ ఇదిగో..
ఇక ఇదే విషయంపై మాస్టర్‌ బ్లాస్టర్‌ను ఓ జాతీయ మీడియా ఛానల్‌ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అవన్నీ వట్టి రూమర్సే అని సచిన్‌ కొట్టిపారేసినట్లు సమాచారం. వచ్చే సీజన్‌లో కూడా ముంబై మెంటార్‌గా సచిన్‌ కొనసాగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాగా 2014 సీజన్‌ నుంచి ముంబై ముంబై మెంటార్‌గా సచిన్‌ తన సేవలు అందిస్తున్నాడు. అదే విధంగా 5 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు సచిన్‌ ప్రాతినిథ్యం వహించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన టెండూల్కర్‌.. 2334 పరుగులు చేశాడు.
చదవండి: Asia Cup 2023: సెమీస్‌లో భారత్‌ను ఓడించి.. కట్‌చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్‌గా

>
మరిన్ని వార్తలు