-

IPL 2024: గుజరాత్‌ కెప్టెన్‌గా గిల్‌

28 Nov, 2023 02:19 IST|Sakshi

ఐపీఎల్‌లో తొలిసారి నాయకత్వ బాధ్యతలు

న్యూఢిల్లీ: భారత ఓపెనర్, కెరీర్‌లో మంచి ఫామ్‌తో దూసుకుపోతున్న శుబ్‌మన్‌ గిల్‌కు మరో మంచి అవకాశం లభించింది. ఐపీఎల్‌ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు అతను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో అతని స్థానంలో గిల్‌ను సారథిగా నియమిస్తున్నట్లు టైటాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ‘గిల్‌ తన కెరీర్‌లో మంచి ఎదుగుదలను చూపించాడు. గత రెండేళ్లుగా అతను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

అతనిలో మంచి నాయకత్వ లక్షణాలను కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చూసింది. గిల్‌ నాయకత్వంలో మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని గుజరాత్‌ టీమ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకి వెల్లడించారు. 24 ఏళ్ల గిల్‌ ఐపీఎల్‌ కెరీర్‌ 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మొదలైంది. నాలుగేళ్లు ఆడిన తర్వాత ఆ జట్టు గిల్‌ను వదులుకుంది. 2022 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ గిల్‌ను సొంతం చేసుకుంది.

తొలి సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 483 పరుగులు చేసిన అతను ఫైనల్లో కీలకమైన 45 పరుగులు సాధించి జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించాడు. అయితే తర్వాతి సీజన్‌లో గిల్‌ చెలరేగిపోయాడు. 3 సెంచరీలు సహా ఏకంగా 893 పరుగులు సాధించాడు. గత ఐదేళ్ల ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్‌ టాప్‌–5లో ఉన్నాడు. విలియమ్సన్, రషీద్, మిల్లర్, వేడ్, షమీలాంటి అనుభవజు్ఞలైన ఆటగాళ్లతో కూడిన జట్టును గిల్‌ నడిపించాల్సి ఉంది.

  గతంలో దేశవాళీ క్రికెట్‌లో దులీప్‌ ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీలలో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం గిల్‌కు ఉంది. మరో వైపు హార్దిక్‌ పాండ్యా 2015 వేలం సమయంలో తొలిసారి తన పేరు వచి్చనప్పుడు, ముంబై ఇండియన్స్‌ తనను రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలు కదలాడుతున్నాయి. ముంబై..వాంఖెడే..పల్టన్‌...చాలా బాగుంది. సొంతింటికి తిరిగి వచి్చనట్లుగా ఉంది’ అని వ్యాఖ్య జోడించాడు.

మరిన్ని వార్తలు