-

T20 WC 2022: 'అందుకే మ్యాచ్‌ ఫిక్సింగ్ జరిగేది'.. పాకిస్తాన్‌ దిగ్గజం సంచలన వాఖ్యలు!

16 Nov, 2022 19:41 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో పాకిస్తాన్‌ ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమ జట్టుపై పాక్‌ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ కీలక వాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్‌లను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నియమించడాన్ని మియాందాద్ తప్పు బట్టాడు. విదేశీ కోచ్‌ల వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రస్తుత ఆటగాళ్ల భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడుతుందని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనలకు దారితీస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.

కాగా ప్రస్తుతం పాకిస్తాన్‌ మోంటార్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్.. బౌలింగ్ కోచ్‌గా షాన్ టైట్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ సహాయక సిబ్బందిలో భాగమైన వెరోన్ ఫిలాండర్ గురించి జావేద్‌ను ప్రశ్నించగా.. అతడు వ్యంగ్యంగా స్పందించాడు. 'వాళ్లను ఈ స్టూడియోకి తీసుకురండి. వాళ్లకి క్రికెట్ గురించి ఎంత తెలుసో మాట్లాడాలి' అం‍టూ జావేద్‌ బదులిచ్చాడు. 

అదే విధంగా గతంలో పాకిస్తాన్‌ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు తరచుగా జరిగిందనే విషయమై మియాంద్‌ మాట్లాడాడు. "గతంలో పాకిస్తాన్‌ తరుపున ఆడిన క్రికెట్లరను చూడంది. వాళ్లు రిటైర్మెంట్‌ అయ్యాక ఖాళీగా ఉండిపోయారు. నేను నా గురించి మాట్లాడటం లేదు. గతంలో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వెళ్లలేదు. ప్రస్తుత ఆటగాళ్ల సంగతి ఏంటి? ‍వాళ్లు ఎక్కడికి వెళ్లినా రాణించలేరు. ఇది ఆటగాళ్లను ఫిక్సింగ్‌కు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ప్రతీ ఒక్కరు తమ కెరీర్‌ కోసం భయపడతారని" అని పాకిస్తానీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  మియాంద్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: 'అంతా బాగానే ఉంది'.. మధ్యవర్తిగా పనిచేసిన ధోని! జడ్డూ ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు