ఆర్చర్‌కు తిరగబెట్టిన గాయం... కోచ్‌ అసహనం

16 May, 2021 16:23 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మోచేతి గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఆర్చర్‌ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. కాగా ఆర్చర్‌ ఇంతకముందు కూడా మోచేతి గాయంతోనే భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మోచేతికి సర్జీరీ చేయించుకోవడంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా ఆర్చర్‌ ఇదే కారణంతో దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకొని ససెక్స్‌ తరపున కౌంటీ మ్యాచ్‌లు ఆడుతూ ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నాడు. ససెక్స్‌ తరపున కౌంటీ చాంపియన్‌షిప్‌ ఆడుతున్న ఆర్చర్‌ మంచి ప్రదర్శన కనబరుస్తూ వికెట్లు తీస్తున్నాడు. బనానా ఇన్‌స్వింగర్‌.. సాట్నర్‌... ఇలా రకరకాల వేరియేషన్స్‌ చూపిస్తూ సరికొత్త ఆర్చర్‌లా కనిపించాడు. అయితే కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  శనివారం ఆర్చర్‌ ఐదు ఓవర్లు వేసిన తర్వాత గాయం తిరగబెట్టడంతో మళ్లీ బౌలింగ్‌ వేయలేకపోయాడు.

ఇదే విషయమై ససెక్స్‌ కోచ్‌ ఇయాన్‌ సాలిస్‌బరీ అసహనం వ్యక్తం చేశాడు.'' ఆర్చర్‌కు గాయం తిరగబెట్టింది. ఈరోజే బౌలింగ్‌ చేయలేకపోయాడు.. రేపు చేస్తాడని గ్యారంటీ లేదు.  కానీ ఆర్చర్‌ను బౌలింగ్‌ చేయమని చెప్పలేం. దానికి ఈసీబీ అనుమతి అవసరం. ససెక్స్‌ను విజేతను చేయాలని ఆర్చర్‌ భావించాడు. కానీ ఇది మా చేతుల్లో లేదు.. ఈసీబీ అనుమతి ఇస్తేనే ఆర్చర్‌ బౌలింగ్‌కు వస్తాడు.''అంటూ తెలిపాడు.

కాగా టీమిండియాతో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. గాయం తిరగబెట్టడంతో ఆర్చర్‌ ఈ సిరీస్‌ ఆడడం అనుమానమే. అయితే టీమిండియాతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడిన ఇంగ్లండ్‌ ప్లేయర్లకు టీమిండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉ‍న్నాయి. తాజాగా ఆర్చర్‌కు గాయం తిరగబెట్టడం ఈసీబీని ఆందోళనకు గురిచేస్తుంది. కాగా ఆర్చర్‌ ఇంగ్లండ్‌ తరపున 13 టెస్టుల్లో 42 వికెట్లు.. 17 వన్డేల్లో 30 వికెట్లు.. 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు.
చదవండి: మొన్న బనానా ఇన్‌స్వింగర్‌; నేడు స్నార్టర్‌.. నువ్వు సూపర్‌

ఆర్చర్‌ బనానా ఇన్‌స్వింగర్‌.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు