Jasprit Bumrah: బుమ్రా అరుదైన ఘనత.. కపిల్‌, పఠాన్‌ల సరసన

12 Jan, 2022 22:55 IST|Sakshi

Seventh Five Wicket Haul For Bumrah 27 Test Joins Elite List.. టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డు అందుకున్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించాడు. కేప్‌టౌన్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో టీమిండియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకముందు హర్భజన్‌ సింగ్‌ 2010-11లో ఏడు వికెట్లు తీయగా.. అదే మ్యాచ్‌లో శ్రీశాంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక బుమ్రా టెస్టుల్లో ఐదు వి​కెట్లు తీయడం ఇది ఏడోసారి. ఈ ప్రదర్శనలన్నీ విదేశాల్లోనే రావడం విశేషం. ఇక 27 టెస్టుల్లో అత్యధికంగా ఏడుసార్లు ఐదు వికెట్ల ఫీట్‌ సాధించిన బుమ్రా కపిల్‌ దేవ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ల సరసన నిలిచాడు.

చదవండి: Virat Kohli: సెంచరీ మిస్సయ్యాడు.. అయినా రికార్డు అందుకున్నాడు

ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా(5/42)తో పాటు ఉమేశ్‌ యాదవ్‌(2/64), షమీ(2/39), శార్ధూల్‌ ఠాకూర్‌(1/37) రాణించారు. ఫలితంగా టీమిండియాకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్‌ పీటర్సన్‌(72) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను కెప్టెన్‌ కోహ్లి, పుజారా ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను 57/2 స్కోర్‌ వద్ద ముగించారు. కోహ్లి 14 పరుగులు, పుజారా 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మయాంక్‌(7)ను రబాడ, కేఎల్‌ రాహుల్‌(10)ను జన్సెన్‌ పెవిలియన్‌కు పంపారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం టీమిండియా 70 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది.

చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్‌..

>
మరిన్ని వార్తలు