ICC Rankings: మళ్లీ టాప్‌లో కేన్‌ విలియమ్సన్‌; కెరీర్‌ బెస్ట్‌కు కైల్‌ జేమిసన్‌

30 Jun, 2021 15:57 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండువారాల క్రితం ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌కు కోల్పోయిన టాప్‌ ర్యాంకును తాజాగా మరోసారి చేజెక్కించుకున్నాడు. టీమిండియాతో జరిగిన ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కేన్‌ 49, 52 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో మెప్పించిన కేన్‌ మొత్తంగా 900 పాయింట్లు సాధించి టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 878 పాయింట్లతో మార్నస్‌ లబుషేన్‌ మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 812 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక  భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆరో స్థానంలో ఉండగా.. రిషబ్‌ పంత్‌ ఒకస్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు,రెండో ఇన్నింగ్స్‌లో రెండు.. మొత్తంగా ఏడు వికెట్లు తీసిన కివీస్‌ బౌలర్‌ కైల్‌ జేమిసన్‌ కెరీర్‌ బెస్ట్‌ అందుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో జేమిసన్‌ 13వ స్థానంలో నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్న కివీస్‌ ఓపెనర్‌ డెవన్‌ కాన్వే ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ మూడు స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు.

ఇక బౌలింగ్‌ విభాగంలో  ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌(908 పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా.. టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌(865 పాయింట్లు) రెండో స్థానంలో, కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ(824 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా తన టాప్‌ ర్యాంక్‌ను జాసన్‌ హోల్డర్‌(384 పాయింట్లు) కోల్పోయి స్టోక్స్‌తో కలిసి 377 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.

చదవండి: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో పంత్‌.. మాస్క్‌ లేదంటూ ప్రశ్నల వర్షం

మరిన్ని వార్తలు