శ్రీకాంత్, కశ్యప్‌ ఇంటిముఖం

18 Mar, 2021 10:26 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్‌ (భారత్‌) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్‌ 11–21, 21–15, 12–21తో ఎన్‌హట్‌ ఎన్గుయెన్‌ (ఐర్లాండ్‌) చేతిలో... కశ్యప్‌ 13–21, 20–22తో కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో ఓడిపోయారు.

సింధు 21–11, 21–17తో సోనియా (మలేసియా)పై గెలిచింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 21–14, 21–12 తో బెన్‌యాప–నుంతకామ్‌ (థాయ్‌లాండ్‌) జోడీపై... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–7, 21–10తో నిఖర్‌ గార్గ్‌ (ఇంగ్లండ్‌)–అనిరుధ (భారత్‌) జంటపై గెలిచాయి. టోర్నీకి ముందు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో ముగ్గురు భారత ఆటగాళ్లకు, సహాయక సిబ్బందిలో ఒకరికి పాజిటివ్‌ రాగా... మంగళవారం మళ్లీ నిర్వహించిన పరీక్షలలో అందరికీ నెగెటివ్‌ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు